వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు

03-05-2018 Thu 08:38 | Both States
  • క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలు
  • రిపోర్టు తయారు చేసిన నెల్లూరు ఎస్పీ రామకృష్ణ
  • ఏసీబీ విచారణకు ఆదేశించిన డీజీపీ మాలకొండయ్య
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదైంది. క్రికెట్ బుకీలతో కోటంరెడ్డికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పూర్తిస్థాయి వివరాలతో కూడిన నివేదికను తయారు చేసిన నెల్లూరు ఎస్పీ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు నివేదికను సమర్పించగా, ఆయన తదుపరి విచారణను ఏసీబీకి అప్పగించారు. ఈ కేసును సమగ్రంగా దర్యాఫ్తు చేయాలని ఏసీబీ డీజీ ఠాకూర్ కు మాలకొండయ్య లేఖను రాశారు. దీంతో ఏసీబీ యాక్ట్ కింద కోటంరెడ్డి కేసు నమోదు చేసిన అధికారులు, క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న బుకీ గ్యాంగులకు కోటంరెడ్డి అండగా నిలిచారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

విజయవాడలోని పలు హోటళ్లలో ప్రధాన బుకీ కృష్ణసింగ్ అనుచరులతో కోటంరెడ్డి పలుమార్లు సమావేశమైనట్టు గుర్తించిన పోలీసులు, అందుకు హోటల్ బిల్లులు, సీసీటీవీ ఫుటేజీలను సాక్ష్యంగా సేకరించి, రిపోర్టుకు జత చేశారు. కృష్ణసింగ్ పేరు బయటకు వచ్చిన తరువాత, ఆయన కొన్నాళ్లు పరారీలో ఉండగా, ఆ సమయంలో దాక్కోవడానికి చోటు కల్పించింది కోటంరెడ్డేనని, ఆపై కృష్ణసింగ్ కోర్టులో తనంతట తానుగా లొంగిపోయేందుకు కూడా కోటంరెడ్డి సహకరించారని, ఇందుకుగాను విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా రూ. 23 లక్షలను కోటంరెడ్డికి కృష్ణసింగ్ అందించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
YSRCPKotamreddy Sridhar ReddyCricketBettingKrishna Singh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more